శ్రీశైలం ఘాట్‌లో బస్సు ప్రమాదం

త‌ప్పిన ప్రాణాపాయం

నాగ‌ర్ క‌ర్నూల్‌, నంద్యాల‌, ఆంధ్ర‌ప్ర‌భ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగిపోయింది. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు.

Leave a Reply