విహారం విషాదం… ముగ్గురూ ఇంటర్ విద్యార్థులే..!

Follow up – నెల్లూరు ప్రతినిధి: సముద్రతీర విహారం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నెల్లూరులోని కోటమిట్టకు చెందిన ఒక కుటుంబం, వారి బంధువులతో కలిసి సమీపంలోని మైపాడు బీచ్‌కు వెళ్లింది.
ఆ సమయంలో హుమాయున్ (17), మహ్మద్ తాజిమ్ (17), సమీద్ (17) అనే యువకులు సముద్రంలో స్నానం చేస్తుండగా లోతును అంచనా వేయలేక గల్లంతయ్యారు. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తరువాత గాలించి సముంద్రం నుండి మృతదేహాలను బయటకు తీశారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఇందుకూరుపేట సబ్-ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
