TTD | అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం

తిరుమ‌ల – శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్ట్ కు చెందిన తుషార్ కుమార్ ఈ విరాళాన్ని అందించారు. విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *