ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం

ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం

‎‎ఏలూరు మహిళ నుంచి 51.90లక్షలు స్వాహా


‎ఏలూరు జిల్లా, ‎ఆంధ్రప్రభ బ్యూరో: ‎ఏలూరు జిల్లాలో ఆధార్ వెరిఫికేషన్ (Aadhaar verification) పేరుతో మోసం చేసిన సైబ‌ర్ ముఠా పోలీసుల‌కు చిక్కింది. కేసులో 11మంది సూత్ర‌, పాత్ర‌ధారుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముంబాయి, ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు ఉన్నట్లుగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.‌ ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో 23మంది పలు టీములుగా విడిపోయి దర్యాప్తు జరపగా, వివిధ రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరస్తులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ‎ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ‎ఇటీవల వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

‎డిజిటల్ స్కాం (digital scam) ఎలా చేస్తారు.. ఏ విధంగా నమ్మిస్తారో తెలుసుకుని ఆశ్చర్యపోయామని, జార్కంఢ్ లో ఈ ముఠా కార్యకలాపాలు కీలకంగా ఉన్నాయని, ఫోన్స్, కంప్యూటర్ లో లాగిన్ అయ్యి, మన వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మన ద్వారానే మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుంటూ డబ్బులు ఖాతా నుంచి కాజేస్తున్నారని హెచ్చరించారు. ‎తాము అరెస్టు చేసిన వారిలో మహారాష్ట్ర కు చెందిన బ్యాంకు మేనేజర్, కానిస్టేబుల్ కూడా నిందితులుగా ఉన్నారని, దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం చాలా విస్తరించి మోసాలు చేస్తున్నారని తెలిపారు.

వివిధ రాష్ట్రాల పోలీసులు (Police of various states) టీం లు కూడా ఈ సైబర్ క్రైం ల పై దృష్టి పెట్టారన్నారు. ఈ ఒక్క‌కేసు ద్వారా 400 ఫిర్యాదు ల కు చెందిన కేసులను చేధించామని,150 బ్యాంకు ఖాతాలు, ఎ.టి.ఎం‌ కార్డుల ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని, 3.57 కోట్లు వారి ఖాతాల్లో ఫ్రీజ్ చేశామనీ, ఐదు బినాన్స్ వాలెట్లు , 2.2 కోట్లు రెండు రోజుల్లో నిందితులు తరలించారని ఐజీ వివ‌రించారు. ‎ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యోగాల కోసం అన్వేషణ లో ఇలాంటి మోసాలకు ఎక్కువ మంది యువత బలైపోతున్నారనీ, లింక్ లు, ప్రకటనలు పై సందేహం ఉంటే 1930 కి కాల్ వివరాలు తెలుసుకోవాల‌ని సూచించారు. ‎ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి ఆయన కోరారు.

Leave a Reply