విద్యుత్ శాఖ పర్యవేక్షణలో మరమ్మత్తులు

అచ్చంపేట (ఆంధ్రప్రభ) : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన‌ భారీ వర్షాల ప్రభావంతో మర్లపాడు తాండా పూర్తిగా ముంపుకు గురైంది. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఘనపూర్, అకారం, ఆంజనేయుల తాండా, బక్కలింగయ్యపల్లి గ్రామాలు నీటమునిగిపోయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

వర్షాల తీవ్రతతో విద్యుత్ స్తంభాలు, తీగలు నీటమునిగిపోవడంతో గ్రామాలు చీకటిలో మునిగిపోయాయి. అయితే నీటి మట్టం తగ్గుతుండటంతో విద్యుత్ శాఖ సిబ్బంది శరవేగంగా మరమ్మత్తు పనులను ప్రారంభించారు. వాగులు, వంకలు ఉధృతంగా ఉన్నప్పటికీ సేవా స్పూర్తితో సిబ్బంది నక్కలగండి వాగును దాటి స్తంభాలను సరిచేస్తూ విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.

త్వరితగతిన నాణ్యమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలనే అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ మరమ్మత్తు పనులను విద్యుత్ శాఖ ఎస్‌ఈ, డీఈ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచనలు ఇస్తున్నారని అచ్చంపేట ఇన్‌ఛార్జి ఏఈ కలుముల ఆంజనేయులు తెలిపారు.

Leave a Reply