ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) కీలక నియామకాలు చేపట్టింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ శుక్రవారం 16 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నియమితులైన వారిలో… బాతుల హరిదాసు (మంగళగిరి), బొండాల శ్యామ్ (యేలమంచిలి), ద్వారపురెడ్డి శ్రీనివాసరావు (పార్వతీపురం), జి చంద్రమోహన్ యాదవ్ (హిందూపూర్), గారికపాటి శివశంకర్ (గన్నవరం), కనవతి హేమలత (ధర్మవరం), కెల్లా అప్పలనాయుడు (విజయనగరం), ఖాజా రహమతుల్లా (బాపట్ల), నాక శ్రీను (యర్రగొండపాలెం), సైలాక్షమి బందారు (గజపతినగరం), సునీల్ ఆహూజా (జగ్గయ్యపేట), వీరవల్లి వెంకట ప్రసన్న కుమార్ (నరసరావుపేట), వెంకట కృష్ణారావు కారుమంచి (పార్చూరు), వెంకటరత్నం చోడే (ఏలూరు), వెన్న ఈశ్వరుడు (ప్రత్తిపాడు), వేణుగోపాలకృష్ణరాజు ముదునూరి (రాజోలు) ఉన్నారు.
ఈ డైరెక్టర్లంతా తమ బాధ్యతలు చేపట్టిన తేదీ నుండి రెండు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగుతారు.


