హైదరాబాద్ : హైదరాబాద్‌లోని HCAH రీహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ గైట్ రీహాబిలిటేషన్ టెక్నాలజీ “జి గైటర్”ను తొలిసారిగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అడ్వాన్స్ రోబోటిక్స్ & రికవరీ సెంటర్ ప్రారంభోత్సవంలో భాగంగా జరిగింది.
కార్యక్రమంలో HCAH ఇండియా సహ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డా. గౌరవ్ తుక్రాల్, అంకిత్ గోయెల్, డిజిటల్ గ్రోత్ హెడ్ రాహుల్ జైన్, కాన్సెప్ట్ అండ్ క్లినికల్ ఎక్సలెన్స్ హెడ్ డా. విజయ్ జనగామ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జలీష్, చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ శ్రీమతి నిషా తదితరులు పాల్గొన్నారు.
జెన్‌రోబోటిక్స్ రూపొందించిన “జి గైటర్” ఇప్పటికే భారతదేశం, విదేశాలలోని అనేక ప్రధాన వైద్య సంస్థల్లో వినియోగంలో ఉంది. ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఖచ్చితమైన, స్థిరమైన గైట్ థెరపీ అందించడంలో సహాయపడుతుంది. ఫిజికల్ మెడిసిన్, మొబిలిటీ పునరుద్ధరణలో ఇది రోగుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని నిపుణులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఈ సాంకేతికతను మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన HCAH, రోబోటిక్స్, ఏఐ ఆధారిత రీహాబిలిటేషన్‌ను ప్రధాన వైద్య పద్ధతుల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
ప్రారంభోత్సవ వేడుకలో వైద్య నిపుణులు, రీహాబిలిటేషన్ నిపుణులు న్యూరోలాజికల్, ఆర్థోపెడిక్ మరియు ప్రమాదాల అనంతర మొబిలిటీ సమస్యల పరిష్కారంలో రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యాన్ని వివరించారు. “జి గైటర్” వంటి రోబోటిక్ గైట్ ట్రైనర్లు నియంత్రిత, పునరావృత కదలికల శిక్షణ ద్వారా రోగుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా, HCAH రీహాబిలిటేషన్ రంగంలో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, అధునాతన వైద్య సేవలను రోగులకు అందించడంలో కొత్త దశను ప్రారంభించింది.

