అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధమా..?
మాక్లూర్ ( ఆంధ్రప్రభ) : మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి, బాకీ కార్డుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్మూర్ (బి) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఏంసి డైరెక్టర్ వెంకటేశ్వర రావు (Venkateshwar Rao), నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు పై మండిపడ్డారు. మండల కేంద్రంలో శుక్రవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఏఏంసి డైరెక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… రాష్ట్రం అభివృద్ధి (Development) పథంలో దూసుకెళ్తుంటే.. ఓర్వలేక పోతున్నారని.. మేము ప్రజలకు హామీ కార్డులు ఇచ్చి హామీలను నెరవేరుస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, భా.రా.స అవినీతి అక్రమాల పై చర్చకు సిద్ధమా అని మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని అగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ (Indira Gandhi) 41వ వర్ధంతిని పురస్కరించుకుని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇందులో మాజీ పిఏసిఎస్ చైర్మన్ బురోల్ల అశోక్, జిల్లా పంచాయతీ రాజ్ సంఘటన్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్, మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, మీడియా కో ఆర్డినేటర్ జైల్ సింగ్, రాజేందర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

