ప్రచారంలో దూసుకెళుతున్న మాగంటి సునీత గోపీనాథ్

ప్రచారంలో దూసుకెళుతున్న మాగంటి సునీత గోపీనాథ్
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా నియోజకవర్గంలోని ఫేజ్ -2 శ్రీరాంనగర్, కళ్యాణ్ నగర్ లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ (Maganti Sunitha Gopinath) మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి, కార్పొరేటర్ మందాటి శ్రీనివాసరావు జోరుగా ఇంటింటికి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతిరెడ్డి (Kantareddy Tirupati Reddy) మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇరు కాలనీవాసులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, భారీ మెజార్టీతో మాగంటి సునీత గోపీనాథ్ గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చెర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, BRSV రాష్ట్ర నాయకులు పడాల సతీష్ లతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
