దేశం కోసమే పని చేసిన ప్రజల మనిషి..
కాశీబుగ్గ (ఆంధ్రప్రభ) : సర్ధార్ @150 వరంగల్ జిల్లా కన్వీనర్ ఎరుకల రఘునారెడ్డి, ఆధ్వర్యంలో పోచంమైదాన్ నుండి వెంకట్రామా జంక్షన్ వరకు నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొన్నారు. వెంకట్రామ జంక్షన్ వద్ద గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాల వేసి ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ వజ్ర సంకల్పంతో దేశాన్ని ముక్కలు కాకుండా 562 సంస్థానాలన్నీ ఒక్కటిగా దేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి అన్నారు. ఆటంకాలెన్ని ఎదురైనా తన వాళ్ళే తనకు పెను సవాళ్ళు విసిరినా మొక్కవోని దీక్షతో దేశం కోసమే పని చేసిన ప్రజల మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలియచేశారు. ముఖ్యంగా మన హైదరాబాద్ సంస్థానం నిజాంను తలవంచి సలాం కొట్టించుకున్న ఉక్కుమనిషి అని కొనియాడారు. పటేల్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి మస్సుమాంజలులు, ప్రజలందరికీ జాతీయ ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువ మోర్చా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, బిజెపి సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, జిల్లా కోశాధికారి కూచన క్రాంతి కుమార్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు కందిమల్ల మహేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైరి నాగరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మదాసు రాజు, అల్లి అజయ్, సిహేచ్ రాము, రవికిరణ్, బీజేవైమ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

