KNR | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా గులాబీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
బాణాసంచా కాల్చి నృత్యాలు చేశారు. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సైతం కేసీఆర్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటిచందర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.