ఒంగోలులో వరద నష్టం ఎంత…?
ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : తుఫాన్ సృష్టించిన నష్టాలను అంచనా వేసే పనుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. తుఫాన్(storm) ప్రభావంతో ఆర్ అండ్ బి పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. అదే విధంగా వ్యవసాయ శాఖకు నష్టవాటిల్లింది. ట్రాన్స్కో అధికారులు కూడా నష్టం అంచనాలను రూపొందించే పనులు నిమగ్నమయ్యారు. నష్టం అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విడుదల చేసే సహాయ కోసం అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
చీరాల ఇంకొల్లు మధ్య మద్దిరాలపాడు కొండేపి(Maddiralapadu Kondepi) మధ్య బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపట్నం మండలానికి వెళ్లే రహదారులు దెబ్బతినడంతో ఆర్టీసీ బస్సులను వేరే మార్గమైన మడూరు వైపు తిప్పుతున్నారు. రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి(Bala Veeranjaneya Swamy) తన నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మలవరప్పాడు వరద ఉధృతికి గురైన రోడ్లను పరిశీలించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కొత్తపట్నం మండలంలో పర్యటిస్తున్నారు. మొత్తం మీద తుఫాను ప్రభావంతో జిల్లాకు భారీ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

