వెంగళరావు నగర్,(ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిమాణాలలో రోజుకో మలుపు తీసుకుంటూ ట్విస్ట్ లపై ట్విస్ట్ లు ఇస్తుంది. ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నారు.
ఇదే నేపథ్యంలో వెంగళరావునగర్ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని , కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్బంగా కిలారి మనోహర్ కు కండువా కప్పి పార్టీలోకి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్. ఈ కార్యక్రమంలోబిక్కసాని నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

