వరద ప్రాంతాల్లో.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తుఫాను తీవ్రత వల్ల అచ్చంపేట(Achampeta) నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(Dr. Rikudu Vamsi Krishna) ఈ రోజు పర్యటించారు. వాగులు, నదులు, చెరువులు, కుంటలు భారీ ప్రవాహంతో ప్రవహిస్తున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.


అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారుల(department officialsను ఆదేశించారు. అంకిరోని పల్లి గ్రామం మైలకుంట ప్రాంతంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చంద్రవాగు(Chandravagu) ఉదృత్తికి గొడుగు వీరయ్యకు చెందిన గేదెలు వరదలో కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్నఎమ్మెల్యే వంశీకృష్ణ ఫోన్లో బాధితునితో మాట్లాడి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

