కొనసాగుతున్న పోలీసు అమరవీరుల వారోత్సవాలు

కరీంనగర్, (ఆంధ్రప్రభ) : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోగల అస్త్ర కన్వెన్షన్ హాలు నందు రక్తదాన శిబిరం (బ్లడ్ డొనేషన్) కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ సీపీ గౌష్ ఆలం (CP Gaush Alam) తెలిపారు.

ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21 ఇండో – చైనా సరిహద్దుల్లో (లఢక్ ) లో జరిగిన సంఘటనలో 10 మంది జవానులు మృతి చెందినందున ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 21 వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవం దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అక్టోబర్ 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణార్ధం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా ప్రజలను భగస్వామ్యులను చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియచేశారు. దీని ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ విధులను నిర్వహించే విధానాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు పోలీసు అమరవీరులను స్మరిస్తామన్నారు. ఇందులో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని (Mega blood donation camp) ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తదానం వలన అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడుతుందన్నారు. తలసీమియా బాధితులకు ఎంతో అవసరమన్నారు. సామజిక బాధ్యతతో అందరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా 160 యూనిట్లను సేకరించామని, సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్ కు అందజేశామని పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి లతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply