కాపాడిన వీరెశెట్టిపల్లి గ్రామ‌స్థులు

కాపాడిన వీరెశెట్టిపల్లి గ్రామ‌స్థులు

తాండూరు రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : తాండూరులో ఉదృతంగా ప్రవహించిన కాగ్నానది వాగులో ఓ వ్యక్తి కొట్టుకు వచ్చాడు. గమనించిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామం(Veer Shettipalli village)లో చోటు చేసుకుంది.

యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు. వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం(Check Dam) వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాగులోకి తాడు విసిరి.. నర్సయ్య(Narsaiah)ను ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం నర్సయ్యకు ప్రాణాపాయం త‌ప్పింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు చేసిన సాహసానికి పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply