నెల్లూరు జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం.. రాకపోకలకు అవాంతరం
కోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రభ : నెల్లూరు జిల్లా కోట మండలం గూడూరు(Gudur) దుగ్గరాజపట్నం రోడ్డు మార్గంలో విద్యానగర్ కోట అడ్డరోడ్డు మధ్యలో గల చల్ల కాలువ బ్రిడ్జి వద్ద ఆర్ టీసీ(RTC) బస్సు బురదలో కూరికుపోయి పక్కకు వాలిపోయింది. డ్రైవర్ బస్సును చాకచక్యంగా ఆపి ప్రయాణికులను దించి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్(Dr. Pashim Sunil Kumar), సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆర్టీసీ డీఎంతో మాట్లాడారు. తుఫాను కారణంగా వాహనాలను ముఖ్యంగా ప్రయాణికులతో ఉన్న వాహనాలను అతి జాగ్రత్తగా నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేటట్లు చూడాలని ఆర్టీసీ డీఎం అని ఆదేశించారు.


