మంత్రి కోరిక ఇదే..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సోమవారం అమ్మవారిని దర్శించుకున్నారు.
మంత్రికి దేవస్థానం కార్యనిర్వాహణా అధికారి శ్రీనివాసులు… వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు.
రాష్ట్రం బాగుండాలని.. ఉమ్మడి కుటుంబం మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. దేవాలయం అంతా కలియతిరిగి ప్రత్యేక పూజలు చేపట్టారు. కుటుంబ సభ్యులందరికీ భక్తి ప్రసాదాలను పండితులు అందజేశారు.

