ప‌త్తికి మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తుంది

ప‌త్తికి మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తుంది

భూపాలపల్లి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సీసీఐ కేంద్రాల్లో ప‌త్తి అమ్మితే మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తోంద‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) అన్నారు. ఈ రోజు చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాట‌న్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో(CCI Centres) పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే(MLA) ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply