సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..

సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..

ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : మోంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు(District SP V. King Harshvardhan) తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, విపత్తు పరిస్థితుల్లో ఇతర శాఖలతో సమన్వయంగా పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన ఎస్పీ తుఫాను పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర చర్యల పై సమీక్ష నిర్వహించారు.

కంట్రోల్ రూమ్ సిబ్బందితో మాట్లాడి ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించాలని సూచించారు. డయల్ 100, 112 సేవలు 24 గంటలు నిరంతరాయంగా పని చేయాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల(drone cameras) ద్వారా తీరప్రాంత పరిస్థితులను పరిశీలించడమే కాకుండా, ప్రమాదకర ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తీరప్రాంత పోలీసులతో ప్రత్యేకంగా మాట్లాడి భద్రతా చర్యల ప్రణాళికను రూపొందించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం అవసరాన్ని ఎస్పీ తెలియచేశారు.

లైఫ్ జాకెట్లు, రోపులు, కట్టర్లు, జెసిబీలు, క్రేన్‌లు, ట్రాక్టర్లు(JCBs, cranes, tractors) మొదలైన అత్యవసర సామగ్రి తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తుఫాను ప్రమాదాల పై అవగాహన కల్పించి, ప్రభుత్వం నిర్దేశించిన సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వాగులు, కాలువలు ఉప్పొంగే సందర్భాల్లో ప్రమాదకర ప్రదేశాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు రహదారుల పై పడినప్పుడు, వాటిని తొలగించేందుకు జెసిబీలు, క్రేన్‌లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి హ్యాండ్ మైక్‌(Hand Mic)లను సిద్ధం చేశామన్నారు. విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఒక్కరి భద్రతను కాపాడటం మా ముఖ్య బాధ్యత అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్శనలో ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర(Inspector Raghavendra), కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply