ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎందుకో తెలుసా..?
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సాంకేతిక అవసరాలను ఉపయోగించుకుని పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు, సాంకేతిక ఉపకరణాలతో పాటు సైబర్ క్రైమ్, శక్తి యాప్(Cyber Crime, Shakti App)ల గురించి విద్యార్థులకు వివరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సోమవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే సంస్మరణ వారోత్సవాలను ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్(SP Sunil Sheran) పోలీసు ఆయుధాల ప్రదర్శన ను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాగానే పోలీసు జాగిలం హాని మరియు హ్యాండ్లర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పని తీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి ఎస్పీ విద్యార్థులకు వివరించారు. పోలీసు అమరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాల పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోవడానికి ఈ ఓపెన్ హౌస్(Open House) కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని, క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.
ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు…
ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాల్లో పోలీసులు వాడే 410 డీపీ మస్కట్, 7.62 ఎం ఎం బోల్ట్ యాక్షన్ రైఫెల్, 7.62 ఎం. ఎం. ఎస్ ఎల్ ఆర్, 7.62 ఎం. ఎం. ఏ కె 47 రైఫెల్ 9 ఎం. ఎం కార్బన్, 9 ఎం. ఎం పిస్టల్ వి ఎల్ పిస్టల్ 16 ఎం. ఎం పి పి టీ, ఫెడరల్ గ్యాస్ గన్, టియర్ స్మోక్ గ్రనేడ్స్, టియర్ స్మోక్ షెల్, 303 రఫీల్, 380 రివాల్వర్, ఫైబర్ లాఠీ , హెల్మెట్ స్టోన్ గార్డ్(Helmet Stone Guard), బాడీ ప్రొటెక్టోర్, పోలీసు వయర్ లెస్ కమ్యూనికేషన్, హాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టోర్, డీప్ సర్చ్ మెటల్ డిటెక్టోర్ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టోర్ మొదలగు పరికరాలు అవి పని చేయు విధానం గురించి పోలీసులు విద్యార్ధులకు వివరించారు.
విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం వారు రూపొందించిన శక్తి యాప్ వాటి ప్రయోజనాల గురించి, సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల పై జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని మహిళా ఇన్స్పెక్టర్లు గౌతమి, జయరాం, సిబ్బంది వివరించారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల(Cyber Crime Criminals) చేతిలో పడకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థులకు తెలియజేస్తూ మీరు విన్న వాటిని మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అబ్బురపరిచిన పోలీస్ జాగిలం హనీ విన్యాసాలు….
విన్యాసాలులో భాగంగా ముందుగా జిల్లా ఎస్పీ పోలీసు జాగిలం హాని, హ్యాండ్లర్ గౌరవ వందనం చేశారు. అనంతరం జాగిలం పేలుడు పదార్థాలు ఉంచిన బాక్సులను గుర్తించాయి. అంతేకాక పోలీసు జాగిలాలు పేలుడు పదార్థాలు, హత్యలు, దొంగతనాలు జరిగిన సందర్భాలలో నిందితులను గుర్తించడం కోసం జాగిలాలు విధులు నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు(Yugandhar Babu), ఆర్ ఐ బాబు, మంజునాథ్, సురేశ్ బాబు, ఆర్ ఎస్ ఐలు, పోలీస్ సిబ్బంది విధ్యార్థినీ విధ్యార్థులు పాల్గొన్నారు.

