మన గ్రోమోర్ ప్రారంభం
వెల్గటూర్, ఆంధ్రప్రభ : రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు మన గ్రోమోర్ (కోరమాండల్) వ్యాపార కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. జగిత్యాల జిల్లా (Jagityal District) వెల్గటూర్ మండల కేంద్రంలో మన గ్రోమోర్ బ్రాంచ్ని వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, స్థానిక మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ పోనుగోటి రాం మోహన్ రావులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రోమోర్ సంస్థ అధికారులు (Gromor company officials) మాట్లాడుతూ.. వ్యవసాయానికి కావలసిన అన్ని రకాల సేవలను మన గ్రోమోర్ ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గోళ్ల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, గ్రోమెర్ సంస్థ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

