సమగ్ర ఉద్యోగుల బదిలీలకు గ్రహణం
గోదావరిఖని, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర విద్య, డిజిటల్ విద్యాభివృద్ధికీ(For digital education development) నిరంతరం కృషి చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సీఆర్పీ బదిలీలకు గ్రహణం పట్టింది. వందలాదిమంది సమగ్ర ఉద్యోగులు సర్కారు దయాదక్షిణ్యాల కోసం ఎదరుచూస్తున్నారు. స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ల కోసం నిరీక్షిస్తున్నారు. భర్త ఒక జిల్లాలో… భార్య మరొక జిల్లాలో పనిచేస్తూ మానసిక వేదనకు గురవుతున్నారు.
2001లో సర్వ శిక్ష అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాల స్థాయి నుండి 12వ తరగతి వరకు విద్యను సర్వత్రికీకరించడం, సమానత్వం, నాణ్యమైన విద్య డిజిటల్ అభ్యాసం, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా సమగ్ర శిక్ష అభియాన్(comprehensive punishment campaign) రూపకల్పన చేశారు.
ఉమ్మడి రామగుండం మండలంలో 133 మంది, పెద్దపెల్లి జిల్లాలో 489 మంది పనిచేస్తుండగా… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,627 మంది టీచింగ్, నాన్ టీచింగ్ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో సీఆర్పీలు రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది పనిచేస్తున్నారు.
బదిలీల కోసం 14 ఏళ్లుగా నిరీక్షణ!

సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న సీఆర్పీలు బదిలీల కోసం 14 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారు. సీఆర్పీలు స్పాజ్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ల విషయంలో మొదటి నుండి బదిలీల అవకాశం దక్కలేదు. సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, ఎంఐఎస్, సీసీఓ(MIS, CCO), ఐఈఆర్పీ కాంట్రాక్టు ఉద్యోగులకు జిల్లా, అంతర్ జిల్లా బదిలీల అవకాశం రెండు మూడు పర్యాయాలు కల్పించారు.
ఇదే సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న రెండు వేల మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. వీరికి సంబంధించి స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు మాత్రం జరగడం లేదు. సంవత్సరాలు గడుస్తున్న సీఆర్పీల బదిలీల పై విద్యాశాఖ అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదనే వాదన వినిపిస్తోంది.
ప్రేమకు దూరం..
ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉద్యోగులకు స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న సీఆర్పీల స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. సంవత్సరాల తరబడి భర్త ఒక జిల్లాలో భార్య మరొక జిల్లాలో ఇద్దరు విడివిడిగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భార్యాభర్తల(husband and wife) మధ్య సంవత్సరాలుగా ఎడబాటు కనిపిస్తుంది.
ఫలితంగా వీరి కుటుంబాల్లో ఎడబాటు సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇదంతా ఒకవైపు అయితే వీరి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరం అవుతుందని చెప్పాలి. పాఠశాలల్లో పిల్లలకు పరిపూర్ణంగా విద్యనందిస్తున్న సిఆర్పి లు వారి పిల్లల ఆలనా, పాలనా చూసుకునే పరిస్థితి లేకుండా పోతుంది.
అటకెక్కిన 400 మంది బదిలీల దరఖాస్తులు
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల స్పౌజ్, మ్యూచవల్ బదిలీల కొరకు జులై లో తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి 400 మంది సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఈ ప్రక్రియ జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను సైతం సీఆర్పీలు కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేసి కుటుంబాల ఎడబాటును వివరించినట్లు కాంట్రాక్టు ఉద్యోగులు చెబుతున్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోమని నెలలు గడుస్తున్నా అవకాశం కల్పించకపోవడం పై సీఆర్పీలు రాష్ట్ర ప్రభుత్వం దయ దక్షిణ్యాల కోసం ఎదురుచూస్తున్నారు.

