Mandyala |కీచక ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్
ఆంధ్రప్రభ నంద్యాల బ్యూరో…… నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల లో హెచ్ఎం మల్లేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.జనార్దన్ రెడ్డి తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు రుజువు అయ్యాయని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇచ్చిన సూచనల మేరకు ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన సంఘటన చోటు చేసుకుంది.అ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధినీలపై ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజు లైగింక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.