ప్రైవేట్ హాస్టల్స్ లో విద్యార్థుల విచ్చలవిడితనం.
నర్సంపేట, ఆంధ్రప్రభ : ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్న హాస్టల్స్, ప్రైవేటు(Hostels, private) పాఠశాలల నిర్వహణలో నడుస్తున్న హాస్టల్స్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్స్ లో ఫైర్ సేఫ్టీ లేదు. ఇంటర్మీడియట్ నుండి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉండే హాస్టల్ లో కూడా ఫైర్ సేఫ్టీ లేక యాజమాన్యాలు పట్టించుకోక విద్యార్థులు విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు.
మత్తుకు, మద్యానికి అలవాటు పడుతూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్న సంఘటనలు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో(Narsampet Division) అనేకం వెలుగులోనికి వస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్నపిల్లల హాస్టల్లో కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేక జరగరాని సంఘటనలు జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులకు కన్నీళ్ళే మిగులుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల హాస్టల్, కోచింగ్ సెంటర్ల హాస్టల్స్, ఇంటర్ ఇంజనీరింగ్ కళాశాల(Inter Engineering College) హాస్టల్ లో సుమారు పదివేల మంది విద్యార్థులు ఉంటున్నట్లు తెలిసింది. విద్యార్థుల బాగోగులు రాత్రిపూట చూసుకోవడానికి వార్డెన్లను నియమించకపోవడం, హాస్టల్ లో ఉన్న విద్యార్థులు ఏ విధంగా కళాశాల నుండి, పాఠశాల నుండి వస్తున్నారని గమనించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ ప్రాంతాలలో ఉన్న భవనాలలో హాస్టల్ వసతులు ఏర్పాటు చేసిన యాజమాన్యాలు ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేయకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు(Parents) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలలో కూడా విద్యార్థులకు గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు సోకుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థులను చదువుకోడానికి పంపిస్తే ఎలాంటి వసతులు లేని ఇరుకు గదుల్లో కుక్కి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల్లో ఫీజులు(ees in lakhs) చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అగ్ని ప్రమాద శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని ఫైర్ సేఫ్టీ ఉన్న హాస్టల్స్ కు మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఫైర్ సేఫ్టీ నర్సంపేటలో దేనికి లేదు : ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి.
నర్సంపేట పట్టణంలోని కొన్ని పాఠశాలల హాస్టల్స్ గాని, మార్పులకు గాని, ఏసీలు పెట్టుకున్న ఆఫీసులకు గాని, బౌల అంతస్తుల ఇండ్లకు గాని ఫైర్ సేఫ్టీ లేదని నర్సంపేట ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి(Gopal Reddy) ఆంధ్రప్రభకు తెలిపారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ గాని, ఫస్ట్ ఎయిడ్స్ గాని లేదని అనేక మార్లు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు తీసుకోవాలని ఎన్ని మాటలు చెప్పినప్పటికీ యజమాన్యాలు విడిచి పెడుతున్నాయని, వీటన్నింటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నపిల్లలు ఉండే హాస్టల్స్ కు తప్పకుండా ఫైర్ సేఫ్టీ(Fire Safety) తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఫీజులపై ఉన్న శ్రద్ధ పిల్లలకు వసతులు కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఇది సహించరాని నేరమని ఆయన పేర్కొన్నారు.

