కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం!
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని, ఆయన పరిపాలన సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం గాడి తప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. ఒకానొక విషయానికి వస్తే బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారన్నారు.
ఈ రోజు ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లు పాలనలో కవిత భాగస్వామిగా ఉందని, అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.
హైకమాండ్ కామెంట్ గమనిస్తోంది..
రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ గమనిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. అందరం హైకమాండ్ రాడార్(High Command Radar) లో ఉన్నామని తెలిపారు. మంత్రుల పంచాయీతీ అధ్యయనం ముగిసిపోయిందని చెప్పారు. ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం అని పేర్కొన్నారు.
ఎవరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని ఆయన సూచించారు. గోడలకు సైతం చెవులు ఉండే సమయం, జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మంత్రి కొండా సురేఖMinister Konda Surekha) విషయంలో పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ అని తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు ఎడ్వాంటేజీ గా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
కేంద్రం నుంచి సహకారం లేదు..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో ఫేస్ టూ(Metro Phase Two)కు కిషన్ రెడ్డి అడ్డంకి మారారని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

