భీమవరం డీఎస్పీపై ఫిర్యాదు : మాజీ ఎమ్మెల్యే గ్రంధి
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రతి నెల అందే లంచం నిలిచిపోవడంతో భీమవరం డిఎస్పీ పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వెళ్లాయని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో క్లబ్ ల నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయ్యింది. పోలీసులు రెండు నెలలగా పేకాట క్లబ్ లు నిలుపుదల చేశారన్నారు.గత 14 నెలలుగా భీమవంలో క్లబ్ లలో పేకాట జరిగిందని, ప్రజాప్రతినిధి, అధికార కూటమికి సంబందించిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి రూ.10 లక్షలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఒక క్లబ్ లో తన సొంతంగా ఐదు లక్షల బ్యాంకు ఆడిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
భీమవరంలో ఒక్కో బ్రాందీ షాపు నుండి నెలకు రూ.4.5 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇది భీమవరం ప్రజలకు, అఫీషియల్సుకు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు అందరికీ తెలుసని అన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షనీయమన్నారు. 14 నెలలు నుండి క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు రెండు నెలలు గా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని అన్నారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపాడో అప్పుడు వాళ్లకు వ్యతిరేకం అయ్యాడని అన్నారు. క్లబ్ లలో పేకాటలు ఆడించి దొంగే దొంగ అని అరిసినట్టు కోట్లాది రూపాయలు లో దోచేసారని అన్నారు.
పవన్ కళ్యాణ్ డిఎస్సీ పై చెప్పినది వినకుండా విచారణ చేయండి అనడం మెచ్యూర్డు పాలిటిక్స్ అనీ, భీమవరం ప్రజలను, కూటమి నాయకులను అడిగితే ఇక్కడ జరుగుతున్న బాగోతం బయటపడుతుందని గ్రంధి అన్నారు. డిఎస్సీ జయసూర్య విషయంలో రఘరామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్. అని అన్నారు. అసలు దొంగ ఎవరు అనేది తెలుసుకోవడానికి పవన్ కళ్యాన్ కు ఒక్క నిముషం కూడా పట్టదని అన్నారు. రాముడు అని పేరు ఉన్నంత మాత్రాన అతడు రాముడు అవ్వడని అన్నారు. పవన్ కళ్యాణ్ నేను మిమ్మల్ని కలిసి అన్ని చెప్పాలని నాకు ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో నాకు తెలియదని అన్నారు. పేకాట విషయంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

