క‌లెక్ట‌ర్ జంగాలపల్లి, పల్లం చెరువుల ప‌రిశీల‌న‌

క‌లెక్ట‌ర్ జంగాలపల్లి, పల్లం చెరువుల ప‌రిశీల‌న‌

ఏర్పేడు, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ): ఏర్పేడు మండలం జంగాలపల్లి, పల్లం చెరువులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం పరిశీలించారు. జంగాలపల్లి చెరువు నాలుగు రోజుల కిందట వర్షాలకు తెగింది. గత ఏడాది వర్షాలకు బలహీనంగా ఉన్న జంగాలపల్లి చెరువు కొట్టుకుపోయిన ప్రదేశంలోనే నాలుగు రోజుల కిందట అల్పపీడనం వల్ల కురిసిన భారీ వర్షాలకు అదే ప్రదేశంలో చెరువు కట్ట కొట్టుకుపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ జంగాలపల్లి చెరువును శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి లతో కలిసి పరిశీలించారు.

చెరువు కట్ట తెగేందుకు దోహదపడిన అంశాలను గురించి వారు అధికారులు క‌లెక్ట‌ర్‌కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఏర్పేడు మండలం పల్లం చెరువును పరిశీలించి చెరువు నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తహశిల్దార్ భార్గవి,, ఎంపీడీవో సౌభాగ్యమ్మ , ఇరిగేషన్ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply