మలేసియాలో స్టెప్పులు వేసిన అమెరికా అధ్యక్షుడు
ఆంధ్రప్రభ ఇంటర్నేషన్ వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎక్కడకు వెళ్లినా తన మార్కు చూపిస్తారు. నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు డ్యాన్స్ చేయడం ఇష్టం. అందుకే ఎవరు డ్యాన్స్ చేసినా ఆయన కూడా స్టెప్పులు వేస్తూ వారిని ఉత్సహపరుస్తారు. ఈ రోజు మలేసియా పర్యటనకు వచ్చిన ఆయన రెడ్ కార్పెట్(red carpet) స్వాగతంలో తన సిగ్నేచర్ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు స్టెప్పులు…
ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఈరోజు మలేసియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur) చేరుకున్నారు. సుమారు 23 గంటలు ప్రయాణం చేసిన ఆయనకు మలేసియా ఘన స్వాగతం లభించింది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం(Anwar Ibrahim) స్వాగతం పలికారు. దాంతో పాటూ వారి సంప్రదాయం నృత్యం చేస్తూ కొందరు ట్రంప్ కు వెల్కమ్ చెప్పారు. వాళ్ళను చూసి ట్రంప్ కూడా ఉత్సాహం వచ్చింది. ఆ ట్రూప్ తో కలిసి ఆయన కూడా స్టెప్ లు వేశారు.
