కెపిహెచ్ బీ లో ప్రమాదం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగర కెపిహెచ్ బీ లులు మహల్ సమీపాన బ్రిడ్జి వద్ద ఈ రోజు ఉదయం కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.
అతి వేగంతో వెళ్ళి డివైడర్ ను ఢీకొంది. ఆ తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. యువకులను సూడాన్ దేశస్థులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత యువతులు కారు దిగి మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బీభత్సం సృష్టించిన కారులో ఉన్న సూడాన్ చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

