మెగా జాబ్ మేళాకు శ్రీకారం
ప్రభుత్వ, ప్రవైట్ రంగాలలో ఉపాధి కల్పన
నిరుద్యోగుల నుండి భారీ స్పందన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్ అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) : నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకై కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్‌నగర్ పట్టణం పెర్ల్ ఇన్ఫినిటీ పాఠశాలలో శనివారం సింగరేణి కంపెనీ, డీఈఈట్ కంపెనీ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రవైట్ రంగంలోనూ ఉపాధి కల్పించేందుకే ఈ మేఘా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా మారుమూల ప్రాంతమైన హుజూర్‌నగర్ లో మెగా జాబ్ మేళా కు శ్రీకారం చుట్టామన్నారు.

పరిశ్రమల శాఖాకు అనుబంధంగా ఉన్న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ (Singareni Collieries) సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేఘా జాబ్ మేళాలో భారీ ఎత్తున నిరుద్యోగులు తరలిరాగా అదే స్థాయిలో 275 పరిశ్రమలు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు తరలి రావడం శుభపరిణామమని మంత్రి ఉత్తమ్ అన్నారు. జాబ్ మేళాలో 40వేల పై చిలుకు అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పెరిగిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రెండో రోజు ఆదివారం కూడా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళా కు హాజరైన అభ్యర్ధులకు అల్పాహారం మొదలు బోజనాది సౌకార్యాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సమాజానికి సవాల్ గా మారిన నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కల సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 70 నుండి 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసామన్నారు.
పట్టణ ప్రాంత యువతకు సరి సమానంగా గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు (Employment opportunities) కల్పించాలన్న దృఢ సంకల్పంతోటే మేఘా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. స్థానిక పరిశ్రమలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలతో తానే స్వయంగా సంప్రదించి జాబ్ మేళాలో పాల్గొనేందుకు అంగీకరింప చేశామన్నారు. అర్హులైన వారందరిని ఎంపిక చేయడం తో పాటు జాబ్ మేళా లో హాజరైన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. అనంతరం ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడెం నకిరేకల్ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, డిఐజిఎల్ చౌహన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.పి నరసింహా, నల్గొండ ఎస్.పి శరత్ చంద్రపవార్, ఖమ్మం కమిషనర్ సునీల్ దత్, డిఈఈటి డైరెక్టర్ రాజేశ్వరరెడ్డి, అడిషనల్ కార్పొరేట్ రిలేషన్ డైరెక్టర్ వంశీదర్ రెడ్డి, సింగరేణి కాలరీస్ ప్రతినిధి చందర్ ముఖ్య కాంగ్రెస్ నాయకులు వేనెపల్లి చందర్ రావు, సాముల శివారెడ్డి, రాంరెడ్డి పురుషోత్తంరెడ్డి, తన్నీరు మల్లికార్జున్, దొంతగాని శ్రీనివాస్, గెల్లి రవి, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఆదేర్ల శ్రీనివాసరెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

