ప్రమాదకరంగా మారిన స్పీడ్ బ్రేకర్లు

ప్రమాదకరంగా మారిన స్పీడ్ బ్రేకర్లు

లక్ష్మణచాంద, అక్టోబర్ 24, ఆంధ్రప్రభ న్యూస్: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పొట్టపెల్లి కే గ్రామంలోని ప్రధాన రహదారి స్పీడ్ బ్రేకర్లకు ఎట్టకేలకు ఆర్ అండ్ బి అధికారులు తెలుపు రంగు వేశారు. శుక్రవారం ఆర్ అండ్ బి సిబ్బంది ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, రైస్ మిల్లు దగ్గరలోని స్పీడ్ బ్రేకర్లకు తెలుపు రంగులు వేశారు. కనీసం ఇన్నాళ్లకు అయిన ప్రమాదకరంగా మారిన స్పీడ్ బ్రేకర్లకు రంగు పడ్డది అని గ్రామస్థులు అన్నారు. మండల కేంద్రానికి నిత్యం ప్రధాన శాఖల అధికారులు ఇదే మార్గం గుండా వెళ్తున్నప్పటికీ.. ఇన్నాళ్లు పట్టించుకోకపోవాడం కొసమెరుపు.

Leave a Reply