పెండింగ్ కేసుల పై సమీక్ష

పెండింగ్ కేసుల పై సమీక్ష

గన్నేరువరం, (ఆంధ్రప్రభ) : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ గన్నేరవరం పోలీస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డులను పరిశీలించి, సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సమన్లు, టీఎస్-కాప్, ఈ-సాక్ష్య తదితర సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌, పెండింగ్ కేసుల పై సమీక్ష జరిపి వాటిని త్వరగా పరిష్కరించాలని, స్టేషన్ పరిధి గ్రామాలను సెక్టార్లుగా విభజించి అధికారులను కేటాయించాలని సూచించారు. కొత్త కానిస్టేబుళ్లు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్ని విధులను నేర్చుకోవాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికల పై నిఘా మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్సై నరేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply