విద్యుత్తు కొనుగోళ్లపై
ఎస్ పి డి సి ఎల్ చైర్మన్ కు ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ఏపీ సదరన్ డిస్కమ్ పరిధిలో ఇటీవ విద్యుత్తు కొనుగోళ్ల లో రూ వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విశ్రాంత ఐ జి ఏ బి వెంకటేశ్వర రావు (ABVenkateswaraRao) గురువారం సెంటర్ ఫర్ లిబర్టీ సభ్యులతో ఎస్ పీడీసీఎల్ సీ ఎండి శివశంకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుతో పాటు టెండర్ల మోసాలు అధిక ధరలతో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ ఆధారాలను సమర్పించారు.
గత ప్రభుత్వ హయాం నుంచి ఇటీవలి వరకు సీఎండీగా పనిచేసిన సంతోష్‌రావు (Santosh Rao) ఆ అవినీతి జరిగిందని సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వివిధ కొనుగోళ్లకు సంబంధించి రూ.40వేల కోట్ల అవినీతి జరిగిందని తాము అనధికారికంగా సేకరించిన ఆధారాలతో ఫిర్యాదు చేసామని చెప్పారు.
కొత్తగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన డిస్కమ్ సి ఎం డి శివశంకర్ (Sivashankar) తమ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చేప్పారన్నారు. పూర్తి వివరాలను 24వ తేదీ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ లైబర్టీ ప్రతినిధులు చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.