మత్స్యకారులకు మంత్రి డోలా హెచ్చరిక
ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి (Dola Bala veeranjaneyaSwamy) ప్రత్యేక అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సమీక్షించారు. ప్రధానంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులు ఆదేశించారు.
ఇప్పటికే వర్ష ప్రభావిత మండలాల్లో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేశామని కలెక్టర్ రాజాబాబు (Collector Rajababu) మంత్రికి వివరించారు. జిల్లాలోని వాగులు వంకలు వద్ద ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ రెవిన్యూ అధికారులు గస్తిని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా మండలాల స్పెషలాఫీసర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.