తంగళ్ళపల్లిలో విషాదఛాయలు
తంగళ్ళపల్లి అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ) : తండ్రి, కొడుకు ఇద్దరూ మూడు రోజుల్లో మృతిచెందడంతో తంగళ్ళపల్లి మండల కేంద్రం కన్నీటి సముద్రంగా మారింది. మంగళవారం తండ్రి మెరుపుల పర్షరాములు గౌడ్ (Parasharamulu Goud) (70) అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. ఆయన మృతిచెందిన దుఃఖం నుంచి కుటుంబం బయటపడకముందే ఈ రోజు కొడుకు మెరుపుల శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) (45) కూడా అనారోగ్యంతో మృతి చెందాడు.
శ్రీనివాస్ గల్ఫ్ వెళ్లి వచ్చి కులవృత్తితో జీవనం సాగిస్తుండేవాడు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కష్టజీవులైన ఈ కుటుంబం వరుస మరణాలతో గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.