వీళ్ళకు పండగే…తస్మాత్ జాగ్రత్త..!!
ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా(Jagtial District) ధర్మపురి పట్టణంలో రెండిళ్లలో చోరీ జరిగింది. పట్టణంలోని రాథోడ్ నాందేవ్ తాను అద్దెకు ఉంటున్న ఇళ్లకు తాళం వేసి తన సొంత ఊరైన ఉట్నూరు(Utnur)కు శనివారం వెళ్లాడు.
తిరిగి ఈరోజు వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న సామాగ్రి చిందరవందరగా పడి ఉండటంతో ఇంట్లో రూ.15000 నగదు చోరీ జరిగినట్లు ఆయన తెలిపారు. జర్మనీలో ఉంటున్న సత్తన్న ఇంట్లో కూడా చోరీకి విఫలయత్నం చేసినట్లు తెలిసింది. సంఘటన స్థలాన్ని ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్(Uday Kumar) పరిశీలించారు.
