నెక్స్ట్ ఏం చేస్తారో…

తమిళంలో తాజా సెన్సేషన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే, మూవీ సక్సెస్ మోడ్ లో ఉన్న మేక‌ర్స్ కు సంగీత దిగ్గజం ఇళయరాజా పెద్ద షాక్ ఇచ్చారు.

తన అనుమతి లేకుండా సినిమాలో తన పాటలు రెండింటిని ఉపయోగించారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతివ్వాలని ఆయన కోర్టును కోరగా, ఇళయరాజా విన్నపాన్ని అంగీకరించిన కోర్టు చర్యలకు అనుమతి ఇచ్చింది. గతంలో కూడా ఇళయరాజా తన పాటల కాపీరైట్ ఉల్లంఘనపై కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చట్టపరంగా ఎలా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply