మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడపై కేసు

  • ప్ర‌భుత్వ స్థ‌లంలో అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు
  • అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే య‌త్నం
  • ఎస్సై లోకేష్‌రెడ్డి విధుల‌కు ఆటంకం


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌నే అభియోగం మేర‌కు ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే వెంక‌టే గౌడ (VenkateGowda) పై కేసు నమోదైంది. స్థానికంగా అనుమ‌తులు లేకుండా ప్ర‌భుత్వ స్థ‌లంలో జ‌రుగుతున్న నిర్మాణాల‌ను అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వెంక‌టే గౌడ త‌న అనుచ‌రుల‌తో జేసీబీతో వెళ్లారు.

ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎస్సై లోకేష్‌రెడ్డి తో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ, వైసీపీ నేతలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై లోకేష్‌రెడ్డి (SI LokeshReddy) పట్ల మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ దురుసుగా ప్రవర్తించారని, తీవ్ర పదజాలంతో దూషించి, దాడికి యత్నించారని సమాచారం. దీంతో ఎస్సై లోకేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినందుకు మాజీ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Leave a Reply