దగదర్తి అక్టోబరు 21 (ఆంధ్రప్రభ) : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి, ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ యువనాయుడు భానుచందర్ ఒక్క రోజు ముందే హఠాన్మరణం చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి మరణం పార్టీకి తీరని లోటు,సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని సీఎం చంద్ర బాబు నాయుడు,ఐటీ శాఖ మంత్రి నారలోకేశ్ , పలువురురాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఆయన స్వగ్రామం అయిన దగదర్తి లో వేలాదిమంది ప్రజలు,అభిమానులు మధ్య,ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వము నుంచి హాజరైన మంత్రి డోల వీరాoజనేయస్వామి,చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ బీద రవీచంద్ర, బీద సోదరులు, కంచర్ల శ్రీకాంత్, సోమిరెడ్డి,అజీద్ ,ఇంటూరు నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, కన్నబాబు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మాలేపాటి కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
