హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హాస్టల్ గదిలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా, కాశీబుగ్గకు చెందిన 23 ఏళ్ల శ్రేయ, మాదాపూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తూ అక్కడి హాస్టల్‌లో ఉంటోంది.
నిన్న ఆమె ఆఫీస్ కు వెళ్లలేదు. ఈ క్రమంలో తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.