వేములవాడ, ఆంధ్రప్రభ : వేములవాడ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక సేవకలు అభినందనీయమని, పేదలకు సేవలందిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్, సన్ రైజ్ ఆస్పత్రి సంయుక్తంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమల్ల శ్రీనివాస్, చీకోటి సంతోష్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్, బచ్చు వంశీ, కట్కూరి శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, కొక్కుల రాజు లతోపాటు సన్ రైస్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు