రవాణా చెక్ పోస్టుల్లో త‌నిఖీలు

రవాణా చెక్ పోస్టుల్లో త‌నిఖీలు

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ.1.36 లక్షల నగదు పట్టివేత

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : తెలంగాణ రవాణా శాఖ సరిహద్దు చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులతో హడలెత్తించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోరజ్, బేల్ తరోడా, వాంకిడి రవాణా శాఖ చెక్‌పోస్ట్ లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి లెక్కకు మించి వాహనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.

బోరోజ్ చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ సిబ్బంది మహారాష్ట్ర నుండి వచ్చే లారీల నుండి డబ్బులు వసూలు చేస్తుండగా ఏసీబీ దాడి చేసి రూ. లక్షా 26 వేల నగదును, నిర్మల్ జిల్లా బేల్ తరోడా వద్ద లెక్కకు మించి డబ్బులు వసూలు చేసిన రూ. 13 వేలు, కొమరం భీం జిల్లా వాoకిడి చెక్ పోస్ట్ వద్ద రూ. 5,100 నగదును సీజ్ చేశారు. రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ సిబ్బందినీ నియమించుకొని పరిమితిని మించి అధిక లోడుతో వెళ్తున్న లారీల నుండి పర్మిట్ వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. ఆరు నెలల వ్యవధిలో అంతరాష్ట్ర చెక్‌పోస్టుల‌పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం ఇది రెండవసారి.

Leave a Reply