సమాజంలో ఆడమగ వివక్ష తగదు
- జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధిద్దాం
- కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇక్కడ ఎమ్మెల్యే మహిళ, కలెక్టర్ మహిళ, జిల్లా ఆఫీసర్లలో అత్యధికులు అతివలే. మరి ఈ జిల్లాలో మహిళ అక్షరాస్యత రేటు 56 శాతం కావటం బాధాకరం. ఈ సమాజంలో లింగ వివక్ష తగదు. ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ సమానమే. అందుకే ఆడపిల్లలకు చదువుకునే హక్కును తప్పని సరిగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్(Collectorate) సునయన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలికా విద్య ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించినట్టు తెలిపారు. అక్షరాస్యత రేటు కూడా 100 శాతం ఉండాల్సింది, జిల్లాలో 56 శాతమే(56 per cent) ఉందన్నారు.. అక్షరాస్యత రేటు 100 శాతం తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.. ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా ఇద్దరు సమానమేనని ఆడపిల్ల ఎప్పుడు భారం అనుకోకూడదని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ గా, శాసనసభ్యులుగా, జిల్లా అధికారులుగా ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉన్నారన్నారు.. ఆడపిల్లలను బాగా చదివించడంతోపాటు పౌష్టికాహారం(nutritious) బాగా పెట్టాలని కలెక్టర్ తెలిపారు.. ఇళ్లల్లో కూడా ఆడపిల్ల, మగ పిల్లవాడు అనే వివక్ష ఎప్పుడు చూపించకూడదన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితురాలిని జిల్లా కలెక్టర్(District Collector) గుర్తు చేశారు. 1990 లో తన స్నేహితురాలిని అమెరికాకి పంపించి చదివిపించారని, ఇప్పుడు ఆమె అత్యున్నత స్థానంలో ఉందన్నారు.
ఆ రోజు ఆమె తల్లితండ్రులు కూడా అంత దూరం ఎందుకు అని పంపించక పోతే ఆమె ఇప్పుడు ఆ స్థానంలో ఉండేది కాదన్నారు.. అందుకే ఆడపిల్లలకు చదువుకునే హక్కు కచ్చితంగా ఇవ్వాలన్నారు. తను ఈరోజు కలెక్టర్ గా ఉన్నానంటే కారణం తన తల్లి అని చెప్పారు..చదువుకునే ఆడపిల్ల కుటుంబంలో ఉండడం వల్ల కుటుంబం బాగుపడడంతోపాటు సమాజం కూడా బాగుపడుతుందన్నారు.. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత(Gauru Charita) మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకుని జీవితంలో రాణించాలన్నారు…విద్యార్థి దశలో ఎక్కువ సమయం చదువు మీద కేటాయించాలన్నారు. సమయాన్ని ఎపుడు కూడా వృధా చేయకూడదన్నారు.

గడిచిన సమయం మరల తిరిగి రాదన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఉచితంగా యూనిఫాం, షూస్, బ్యాగ్(Uniform, Shoes, Bag), ఇస్తున్నారన్నారు.. అదే విధంగా మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కూడా పెడుతున్నారన్నారు… తల్లితండ్రులకు పిల్లల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15 వేల రూపాయలు అందించారన్నారు.. పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు గాను విద్యా లక్ష్మీ(Vidya Lakshmi) అనే కార్యక్రమం ద్వారా లక్ష రూపాయల వరకు పావలా వడ్డీతో ఇస్తున్నారన్నారు. అమ్మాయిలు అన్ని రంగాలలో రాణించాలన్నారు.
టెక్నాలజీ ని మంచి కొరకు, చదువు కొరకు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ తాము కోరుకునే రంగంలో స్థిరపడడానికి కృషి చేయాలన్నారు. తల్లి తండ్రులు కూడా తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమ్మాయిల రక్షణ కొరకు స్త్రీ శక్తిStri Shakti) అనే యాప్ కూడా తీసుకొని రావడం జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం నాటకం, డాన్స్ వేసిన చిన్నారులకు కలెక్టర్ పాణ్యం ఎమ్మెల్యే బహుమానాలు అందజేశారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, డీఎంహెచ్ వో డాక్టర్ . శాంతి కళా(DMH Vo Dr. The art of peace), సీపీఓ భారతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదాబేగం, సెక్సువలీ హెరాస్ మెంట్ ప్రివెంటివ్ కమిటీ చైర్ పర్సన్ మాధవి శ్యామల, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విజయలక్ష్మి పాల్గొన్నారు .



