స్తంభంపల్లిలో దారుణం…
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి బంక్ సమీపంలోని రహదారిపై బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందారు.
లక్సెట్టిపేట మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన బెక్కం సతీష్ (వయసు సుమారు 30 ఏళ్లు) తన మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, వేగంగా వస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు సతీష్ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
తక్షణమే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన సతీష్‌ను సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెల్గటూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఉమాసాగర్ వెల్లడించారు.

