మినీ ట్యాంక్‌బండ్ ఆధునికీకరణ పనులు ప్రారంభించిన మంత్రులు

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గం కేంద్రంలోని మక్తల్ పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) వద్ద రూ.3:70 లక్షల రూపాయల సీఎండీఏ నిధులతో మినీ ట్యాంక్ బండ్ ఆధునికీక‌ర‌ణ, సుందరీకరణ పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్ట‌ర్‌ను వారు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మత్స్యశాఖ చైర్మన్ మెట్టా సాయి కుమార్, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply