బాసర, (ఆంధ్రప్రభ): భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. ఈ మేరకు ఎస్సై దయాల్ సింగ్ తెలిపారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మరణించిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై దయాల్ సింగ్ పేర్కొన్నారు.

