పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్, డీఈఓ

పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్, డీఈఓ
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్(Maktal) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పరుగులు వచ్చాయి. బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో కొంత ఆలస్యంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించగా ఓ విద్యార్థి ప్లేట్లోని అన్నంలో పురుగు కనిపించన విషయం తెలిసిందే.
అయితే ఈ రోజు మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు రావడం కలకలం రేపింది. ఈ విషయమై ఏబీవీపీ నాయకులు వినయ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ రాజేందర్(Rajender), డీఈఓ గోవిందరాజులు(Govinda Rajulu), ఎండిఎం యాదయ్య పాఠశాల వద్దకు చేరుకొని అన్నంలో పురుగులు వచ్చిన విషయాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న బియ్యంమార్చి కొత్తగా బియ్యం తెప్పించారు.
అందులోనూ పురుషులు రావడంతో మరోసారి బియ్యం తెప్పించారు. అందులోని పురుగులు రావడంతో ఆందోళన చెందిన అధికారులు కొత్త స్టాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. మొత్తం మీద మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరుసగా రెండో రోజు కూడా అన్నంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం చేర్చనీయాంశంగా మారింది.
