జంగంప‌ల్లిలో దుర్ఘ‌ట‌న‌

జంగంప‌ల్లిలో దుర్ఘ‌ట‌న‌

భిక్కనూర్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటిస్తే ప్ర‌మాదాలు త‌గ్గుతాయ‌ని పోలీసులు చెబుతునే ఉంటారు. కానీ కొంద‌రు డ్రైవ‌ర్లు పెడ‌చెవిన పెట్ట‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ఓ టిప్ప‌ర్(Tipper) న‌లుగురు ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘ‌ట‌న బుధవారం కామారెడ్డి(Kamareddy) జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై జరిగింది.

మృతులు ఖమ్మం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా ముత్తికుంట గ్రామానికి చెందిన కిషన్ అతని కూతురు యాసిన్ అతని మనుమలు జయాల్, ప్రకాష్(Jayal, Prakash)లు కలిసి ఎలక్ట్రిక్ స్కూటీ పై కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. జంగంపల్లి గ్రామం(Jangampally village) వద్ద గల ఛ‌త్రపతి శివాజీ విగ్రహం వద్దకు రాగానే రాంగ్ రూటులో వచ్చిన కంకర టిప్పర్ స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న కిషన్, యాసిన్ అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన జయాల్, ప్రకాష్ ను 108 అంబులెన్స్(108 Ambulance) లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. రోడ్డుపై ప్రమాదం జరగడంతో మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న బిక్కనూర్ ఎస్ఐలు ఆంజనేయులు, నరేందర్ తమ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై చల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

జాతీయ రహదారి(National Highway)పై జరిగిన ప్రమాదం జంగంపల్లి గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నా మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply