ఒకరు మృతి…

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ నూతన ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి తన ఇంటికి నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ (electric shock) కు గురై మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన వెలిచాల రమేష్ నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఇంటికి క్యూరింగ్ కోసం నీళ్ళు కొడుతుండగా కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply